Monday, July 20, 2026
E-PAPER
Homeమానవిమన అమ్మాయికి అరుదైన అవకాశం

మన అమ్మాయికి అరుదైన అవకాశం

- Advertisement -

17 ఏండ్ల వయసులోనే 300 మంది అమెరికన్‌ నేవీ క్యాడెట్లకు నాయకత్వం వహిస్తుంది మన భారత సంతతికి చెందిన బాలిక. రోజూ ఉదయం ఏడు గంటలకే స్కూల్‌ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టి, సైనిక క్రమశిక్షణతో క్యాడెట్లకు దిశానిర్దేశం చేస్తోంది. క్వీన్స్‌‌లో (న్యూయార్క్) ఉంటున్న రిద్ధీ చౌహాన్ తన స్కూల్‌లోని నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కోర్ (ఎన్‌జేఆర్‌ఓటీసీ) యూనిట్‌కు బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా నాయకత్వం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. సూల్ విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు యూఎస్ నేవీ ఈ ఎన్‌జేఆర్‌ఓటీసీ (భారత్‌లోని ఎన్‌సీసీ తరహా ప్రోగ్రామ్) కార్యక్రమాన్ని నిర్వోహిస్తోంది.

రిద్ధీ చౌహాన్ ఇప్పటికే యూఎన్ నేవల్ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్‌లో అడ్మిషన్ సాధించింది. నేవీలో కమాండింగ్ ఆఫీసర్ అవకాశం దిశగా తొలి అడుగు వేసింది. ఫ్రెష్‌మన్ ఇయర్‌లో (9వ తరగతి) ఉండగా రిద్ధీ ఎన్‌జేఆర్ఓటీసీ ప్రోగ్రామ్‌లో చేరింది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఆమె ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంది. ఆ తరువాత స్కూల్లో ఎన్‌జేఆర్ఓ‌టీసీ యూనిట్‌కు అకాడమిక్ కమాండర్‌గా, స్టెమ్ కమాండర్‌గా, ప్లటూన్ లీడర్‌గా, ఇన్‌స్ఫెక్షన్ కమాండర్‌గా పలు బాధ్యతల్లో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుని బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయ్యింది. ఈ బాధ్యతల్లో ఆమె ప్రతి రోజూ 300 మంది క్యాడెట్స్‌కు శిక్షణ కార్యక్రమాల్లో నాయకత్వం వహించడంతో పాటు జూనియర్ క్యాడెట్స్‌కు మార్గనిర్దేశనం కూడా చేస్తోంది. యూఎస్ నేవీలో చేరడమే తన లక్ష్యమని రిద్ధీ తెలిపింది.

కఠిన శ్రమతో ఎదుగుతూ
రిద్ధీ తల్లిదండ్రులు దిలీప్ చౌహాన్, రుచికా చౌహాన్‌లు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వారు. వీళ్ల స్వస్థలం రాజస్థాన్‌లోని జైపుర్‌. అయితే ఉద్యోగరీత్యా వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. రిద్ధీ ప్రస్తుతం న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న బెంజమిన్‌ ఎన్‌. కార్డోజో హైస్కూల్‌లో చదువుతోంది. 9వతరగతి(ఫ్రెష్‌మన్‌ ఇయర్‌) చదువుతున్న సమయంలో స్కూల్లోని ఎన్‌జేఆర్‌ఓటీసీ ప్రోగ్రామ్‌లో ఆమె చేరింది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకే రిద్ధీ ఈ మార్గం ఎంచుకుంది. అంతేకాదు అనుకున్నది సాధించింది. అంకితభావం, కఠిన శ్రమతో ఎదుగుతూ విద్యార్థి దశలోనే ఎన్నో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. ముఖ్యంగా రెండేండ్లపాటు తన పాఠశాల బృందాన్ని నేషనల్‌ లెవెల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ అకడమిక్‌ బౌల్‌ సెకండ్‌ రౌండ్‌కు చేర్చింది. అలానే బెటాలియన్‌లోనే మొట్టమొదటి సీపెర్చ్‌ అండర్‌ వాటర్‌ రోబో తయారీలో కీలకపాత్ర పోషించింది. క్యాడెట్ల క్రమశిక్షణను, శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షించింది. అమెరికా నావికాదళంలో కమాండింగ్‌ ఆఫీసర్‌ కావాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పటికే ఆ దిశగా అడుగులేసి యూఎస్‌ నేవల్‌ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్‌లో అడ్మిషన్‌ సాధించింది. ఇలా ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్న రిద్ధీ మరెంతో మంది ఆడపిల్లలకు స్ఫూర్తినందిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -