
4 నేలల కాలం నుండి మున్సిపల్ సమావేశం నిర్వించడం జరగలేదనీ , ఎన్నికల కోడ్ ఎత్తివేసి కూడా నెల రోజులు అయిందాని వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలనీ టిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశ ఎజెండాలో అన్ని వార్డులకు సంభందించి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రతి వార్డు కు పార్టీలకు అతీతంగా నిధులు కేటాయించి భువనగిరి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మేము మా పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ ఖాజా అజీముద్దీన్, దిడ్డి కాడి భగత్, పంగరెక్క స్వామి, కోఆప్షన్ సభ్యులు అఫ్జల్, నాయకులు చేన్న మహేష్ , కుశంగల రాజు, తుమ్మల పాండు లు పాల్గొన్నారు.