మద్యం ప్రియులకు షాక్ .. భారీగా బీర్ల కొరత

నవతెలంగాణ – హైదరాబాద్ : కొద్ది రోజులుగా హైదరాబాద్ లో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్కా.. మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైట్ బీర్లు, స్ట్రాంగ్ బీర్లు, టిన్నులు, ఇలా వివిధ రకమైనవి అందుబాటులో లేవని వైన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు. ఎండవేడి తట్టుకోలేకపోతున్నామని మద్యం ప్రియులు అంటున్నారు. అధికారులు స్పందించి బీర్ల కొరతను అరికట్టాలని కోరుతున్నారు. పలు షాపుల వద్ద నో బీర్లు అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Spread the love