వికలాంగుల సంక్షేమం, సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టాలి

– సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలి
– ఆత్మ గౌరవం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలి
నవతెలంగాణ -కంటేశ్వర్
వికలాంగుల సంక్షేమం, సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఆత్మ గౌరవం హక్కుల సాధన కోసం ఉద్యమించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు పి కవిత డిమాండ్ చేశారు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిజామాబాద్ సీఐటీయూ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాములు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగ ఎన్ పి అర్ డి నిజామాబాద్ అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ..  వికలాంగులకు విద్యా, ఉపాధి దక్కడం లేదని అన్నారు. వికలాంగులలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగుల జనాభాకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉంటున్నారని. విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక పాలసీనీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.   వికలాంగులు వైద్య పరమైన పునరావాస సేవలు, 8 శాతం మాత్రమే సహాయ పరికరాలు , 15 శాతం మంది ఆరోగ్య సేవలు, 10.5శాతం మంది సంక్షేమ సేవలు పొందుతున్నారని అన్నారు.51 శాతం మంది పాఠశాలలకు వెళ్తే 5 శాతం మంది పిల్లలకు మాత్రమే ప్రత్యేక విద్యా అందుతుందని అన్నారు.44.4 శాతం మంది వికలాంగులు ఏదో ఒక పని చేస్తుంటే 55.6శాతం మంది వికలాంగులు ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సెస్బుల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా 2018 నాటికి ప్రధాన పట్టణాల్లో 50 శాతం కార్యాలయాలు వికలాంగులకు అందుబాటులోకి తేవడానికి 1182 స్థలాలను గుర్తిస్తే  నేటికీ 482 మాత్రమే అందుబాటులోకి వచ్చాయనీ అన్నారు. మనసిక వికలాంగుల సంరక్షణ కోసం ప్రవేశ పెట్టిన మెంటల్ హెల్త్ కేర్ యాక్టు ను పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగుల సహాయకులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలనే 2016 RPD చట్టం సెక్షన్ 24 ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.సంక్షేమ పథకాలలో 25 శాతం అదనంగా ఇవ్వాలనీ చట్టంలో ఉందని దాన్ని వెంటనే అమలు చేసి ప్రభుత్వ పథకాలకు వర్తింప చేయాలని కోరారు.40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు యూనిక్ డిసెబుల్డ్ గుర్తింపు కార్డ్ మంజూరు చేయాలని అన్నారు.2013 ఆహార భద్రత చట్టం ప్రకారం వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం వలన వికలాంగులు రిజర్వేన్స్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయిలు, రాములు, నజీర్, బాయ్, గోపాల్ గౌడ్,సుగుణ, సంగీత,గంగాధర్,హరిప్రియ, చింటూ, సాయినాథ్, ఈ యొక్క కార్యక్రమానికి తదితరులు పాల్గొన్నారు.
Spread the love