Sunday, June 7, 2026
E-PAPER
Homeసినిమామధురమైన పాటలకు వేదిక

మధురమైన పాటలకు వేదిక

- Advertisement -

సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక ‘ది నైట్ ఆఫ్ ది స్టార్స్ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో జరగనుంది. సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, నేపథ్య గాయని గీతా మాధురి, సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి, భార్గవి తమ అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఈ వేడుకని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిఖిల్ విజయేంద్ర సింహ మాట్లాడుతూ,'మనందరం చిన్నప్పటి నుంచి పాటలను మధురమైన జ్ఞాపకాలుగా, నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌గా ఆస్వాదిస్తూ పెరిగాం. ఆ నోస్టాల్జిక్ పాటలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు 23 సంవత్సరాల తర్వాత కళ్యాణి మాలిక్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ లైవ్ షో జరగడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.
‘నా మొదటి సినిమా ‘ఐతేవిడుదలైనప్పుడు ఎంత ఆనందంగా, ఉత్సా హంగా ఫీలయ్యానో, ఈ షో నిర్వహిస్తున్నప్పుడు కూడా అదే భావన కలుగు తోంది అని కళ్యాణి మాలిక్ చెప్పారు.

గాయని గీతా మాధురి మాట్లాడుతూ,’కళ్యాణి మాలిక్ మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ షో గురించి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అందరూ ఈ కార్యక్రమం గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. కళ్యాణి పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నాకు లైవ్ మ్యూజిక్ షోలు అంటే చాలా ఇష్టం. అలాంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -