Sunday, June 7, 2026
E-PAPER
Homeసినిమాఆసక్తికరంగా 'ది ఎండ్ ఎఫ్ ఓక్ స్ట్రీట్`

ఆసక్తికరంగా ‘ది ఎండ్ ఎఫ్ ఓక్ స్ట్రీట్`

- Advertisement -


ఒక రహస్యమైన ఖగోళ సంఘటన ఓక్ స్ట్రీట్‌ను శివారు ప్రాంతం నుండి వేరు చేసి, వారి నివాస ప్రాంతాన్ని తెలియని ప్రదేశానికి తరలిస్తుంది. ఈ నేపథ్యంలో ఓక్ స్ట్రీట్‌కి చెందిన ప్లాట్ కుటుంబం గుర్తుపట్టలేని పరిసరాలలో ప్రయాణిస్తూనే ఉన్నప్పటికీ ఐకమత్యంగా ఉండటాన్ని గమనిస్తారు. ఈ ఐకమత్యంతో వారెలాంటి ప్రయాణం చేశారు?, చివరికి ఏమైంది అనేది ఆద్యంతం ఆసక్తికరం అని మేకర్స్ చెబుతున్నారు.
యాన్ హాతవే, ఇవాన్ మెక్‌గ్రెగర్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’. డేవిడ్ రాబర్ట్ మిచెల్ రచన, దర్శకత్వం వహించగా, జె.జె. అబ్రామ్స్, హన్నా మింగెల్లా, జాన్ కోహెన్, డేవిడ్ రాబర్ట్ మిచెల్, మాట్ జాక్సన్ మరియు టామీ హార్పర్ నిర్మించారు.
క్రిస్ బెండర్, జేక్ వీనర్, జోవాన్ లీ మరియు లీన్ స్టోన్‌బ్రేకర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఎ బ్యాడ్ రోబోట్ ప్రొడక్షన్, ఎ జాక్సన్ పిక్చర్స్ ప్రొడక్షన్, ఎ డేవిడ్ రాబర్ట్ మిచెల్ ఫిల్మ్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. భారతదేశంలో ఆగస్ట్ నెలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, ఐమాక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -