రూ.2,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

– ప్రచారకర్తగా ఎన్‌టిఆర్‌ నియామకం : గ్రీన్‌ఫ్లై సిఇఒ వెల్లడి
హైదరాబాద్‌ : భారత సంఘటిత ప్లైవుడ్‌ మార్కెట్‌లో 25-30 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నామని గ్రీన్‌ఫ్లై ఇండిస్టీస్‌ జాయింట్‌ ఎండి, సిఒ మనోజ్‌ తుల్సియన్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను తమ ప్రచారకర్తగా నియమించుకున్నామని వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో సంఘటిత, అసంఘటిత ఫ్లైవుడ్‌ మార్కెట్‌ ప్రతీ ఏడాది దాదాపు రూ.32వేల కోట్ల విలువ కలిగి ఉందన్నారు. గతేడాది రూ.1800 కోట్ల రెవెన్యూ సాధించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల టర్నోవర్‌ అంచనా వేస్తున్నామన్నారు. వినియోగదారులు మొత్తం ఇంటీరియర్‌ డిజైన్‌లో ప్రస్తుతం 75 శాతం ఫర్నీచర్‌కే వ్యయం చేస్తున్నారన్నారు.

Spread the love