చలమల్ల కృష్ణారెడ్డికి ఘన స్వాగతం

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన చలమల్ల కృష్ణారెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో చౌటుప్పల్ మండల బీజేపీ నాయకులు గురువారం ఘన స్వాగతం పలికారు. మొన్న బుధవారమే కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో భాజపాలో చేరారు. గురువారం వెలువడిన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాలో చలమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఖరారు కాలేదు. మొదటి విడతలో 52 మంది రెండో విడతలో ఒకరికే టికెట్ కేటాయించారు. గురువారం వెలువడిన మూడో జాబితాలో 35 మందితో కూడిన జాబితా వెలువడింది. మునుగోడు భాజపా టికెట్టు ఆశించి భాజపాకు వెళ్లిన చలమల్లకు మూడో జాబితాలో నిరాసే ఎదురైందని చెప్పవచ్చు. ఎన్నికలకు 27 రోజులే ఉండగా మరో జాబితా ఎప్పుడు వెలువ డుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని చలమల్ల వర్గీయులు గుసగుసలు అనుకుంటున్నారు. మునుగోడు భాజాపా టిక్కెట్ చలమల్లకు ఇస్తారా.? మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇస్తారా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డికి ఇస్తారా వేచి చూడాలి.ఏది ఏమైనాప్పటికీ మునుగోడు పోరులో చలమల్ల రాకతో త్రిముక పోరు కొనసాగే అవకాశం ఉంది

Spread the love