ఉపముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం 

నవతెలంగాణ-రామగిరి 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి  ఆలయ 3 వ, వార్షికోత్స కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. నేపథ్యంలో రామగిరి  మండలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తిరుపతి తన స్వ గృహానికి తీసుకుపోయి శాలువాతో సత్కరించి, తేనేటి విందు ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్, విజయ రమణారావు, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తోట చంద్రయ్య, రొడ్డ బాపన్న, మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, బర్ల శ్రీనివాస్, ముస్త్యాల శ్రీనివాస్, కాటం సత్యం,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love