పటియాలా : పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలోని శంభు రైల్వే స్టేషన్‌లో నిర్వహిస్తున్న ‘రైల్ రోకో’ నిరసనలో ఆదివారం మహిళా రైతు మరణించింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 13 నుంచి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ దశ రైతుల నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ కమిటీలో తర్న్ తరణ్ జిల్లాకు చెందిన బల్వీందర్ కౌర్ (55) అనే మహిళా రైతు కూడా ఉన్నారు. ప్రస్తుతం గోధుమ పంట చేతికి వచ్చే కాలం కావడంతో మగవారు పంట కోత పనుల్లో ఉండ టంతో మహిళా రైతులు నిరసనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నిరసన లో పాల్గొన్న బల్వీందర్ శంభు రైల్వే స్టేషన్‌లో ‘రైల్ రోకో’ నిరసనలో మరణిం చింది. కాగా నిరసన ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన మొదటి మహిళా రైతు ఆమె.