ఆరేపల్లి ఆశలు ఆవిరి..?

– అసంతృప్తితో ఆరేపల్లి అనుచరుల మంతనాలు 
– కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి..
నవతెలంగాణ-బెజ్జంకి
మేరుగైన పలితాలు సాధించి ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించిన ఆశవాహుల ఆశలు ఆవిరయ్యాయనే ఆరోపణలు అసంతృప్తుల్లో వ్యక్తమవుతున్నాయి.తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సముచిత స్థానం కల్పిస్తారనే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆశవాహుల ఆశలు సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో గల్లంతయ్యాయి.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీని వీడీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.మానకొండూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయిస్తారని ఆరేపల్లి ఆశించి భంగపాటు గురయ్యాడని తన అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని వీడడమే ఆరేపల్లి చేసిన పోరపాటని.. ఏదిఏమైనా కాంగ్రెస్ తోనే భవిష్యత్తని..తిరిగి తన స్వంతగూటీకి కాంగ్రెస్ పార్టీలో చేరాలని మేజారీటీ అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దాదాపుగా ఖారరవ్వడంతో..తన అనుచరుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన అ పార్టీలోనైనా న్యాయం జరుగుతుందా?లేదా?ఆలోచనలో ఆరేపల్లి ఉన్నట్టు తెలుస్తోంది. అనుచరుల ఒత్తిడి మేరకు ఆరేపల్లి తన స్వంత గూటీకి చేరుతారా?లేకా?మరో దారి వెతుకుంటారా? వేచి చూడాల్సిందే.
Spread the love