అబలవు కావమ్మ…
అబలవు కావమ్మ నీవు సబలవు మాయమ్మ
పితృస్వామ్యాన్ని గెలిచి నిలిచినా యుక్తివి నీవమ్మా ..!
ఆది పరా శక్తివి మాయమ్మ
మతాల గురువులు అందరూ
నీది అధమ స్థానమని ఘొషిస్తే
అన్నిటినీ నువ్వు తోసిరాజని తోవ చూపినావు!
మహిళల వెన్నుతట్టినావు!
బాల్యం చితికిందా..! కౌమారం కాటేసిందా!
కుటుంబం వంచించిందా! సమాజం వెలివేసిందా
కుటుంబ కాటును సమాజ వేటును సవాలు చేసావు!
దగా చేసిన దుష్ట శక్తిపై బాణం విసిరావు
గురి తప్పక కొట్టావు
అబలవు కావమ్మ నీవు సబలవు మాయమ్మ
చుట్టాల దెప్పి పోట్లు చట్టాల వెన్ను పోట్లు
కడుపు కోత పాట్లు ఆచారపు అగచాట్లు
సాక్ష్యం నిలువక మోక్షం కలుగక బోనులో నిలిచావా
చట్టం కోరల్లో చిక్కుక నువ్వు విలవిల లాడావా
బలిపీఠమె ఎక్కావా
అబలవు కావమ్మ నీవు సబలవు మాయమ్మ
ఎంచుకున్న రంగంలో ఘన కీర్తిని చాటావు
పరాభవాల్ని పరాక్రమంతో పార ద్రోలి నావు
కల్లోల కడలిలో దరికి చేరిన కధానాయికమ్మ
హర్డిల్స్ దాటి ఫైనల్స్ చేరిన ఛాంపియనువమ్మా
ప్రపంచ కప్పును పైకి లేపిన
జగజ్జ్యేతవమ్మా..
నీవు జగజ్జ్యేతవమ్మా..
– ఎస్.ఎ.సమద్, 9160100486