పేద విద్యార్థినికి అభయ ఫౌండేషన్ చేయూత

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్

ఐఐటి మండిలో సీటు సాధించిన చెర్లపాలెం గ్రామానికి చెందిన పేద విద్యార్థిని ధర్మారపు వాణిశ్రీ కి అభయ ఫౌండేషన్ విద్యార్థిని చదువు నిమిత్తం అభయ ఆస్తం అందించింది. విద్యార్థిని పరిస్థితిని గుర్తించిన 100 స్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చిట్టి మల్ల మనోజ్ కుమార్ అభయ పౌండేషన్ ప్రతినిధులతో మాట్లాడి విద్యార్థినికి ల్యాప్ టాప్ అందించారు. మూడేళ్ల పాటు ఏడాదికి రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షల హాస్టల్ ఫీజు చెల్లించేందుకు అభయ ఫౌండేషన్ ప్రతినిధులు అంగీకరించారు.ఈ సందర్బంగా 100స్మైల్స్ ఫౌండేషన్ ఫౌండర్ చిట్టి మల్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, వారి ప్రతిభను గుర్తించి సానబెడితే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. చెర్లపాలెం విద్యార్థిని వాణిశ్రీ ప్రతిష్టాత్మక మండి ఐఐటీ కళాశాలలో సీటు సాధించడం గర్వకారణం అని తెలిపారు. ఏ ఒక్క పేద విద్యార్థి ఫీజులు చెల్లించలేక చదువు మధ్యలో ఆపకూడదని తెలిపారు.ఈ కార్యక్రమంలో 100 స్మైల్ ఫౌండేషన్ సలహాదారు చిట్టిమల్ల మహేష్, విద్యార్థిని తండ్రి ధర్మారపు నాగయ్య లు ఉన్నారు.
Spread the love