అటవీ ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం

– జిసిసి మేనేజర్ జాటోతు దేవ్

– ఏజెన్సీలో విస్తృత పర్యటన
నవతెలంగాణ -తాడ్వాయి 
అటవీ ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలని గిరిజన సహకార సంస్థ ఏటూర్ నాగారం (జిసిసి మేనేజర్)మేనేజర్‌ జాటోతు దేవ్ సూచించారు. మండలంలోని పెట్రోల్‌ బంకులు, జీసీసీ గోదాంలను పరిశీలించి, అటవీ ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు.అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. సందర్భంగా జిసిసి మేనేజర్ జాటోతు దేవ్ మాట్లాడుతూ  ప్రస్తుత సీజన్‌లో విషముష్టి గింజలు, తేనె, కర క్కాయలు, నల్ల జీడి, ఎండు ఉసిరి, నరమామిడి చెక్క, ముసిడిక పిక్కలు, తదితర నాణ్యమైన రకాలు గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేయాలన్నారు. తేనె రూ.225, విష ముష్టి గింజలు రూ. 70, చిల్లగింజలు రూ.35, చింతపండు రూ. 70, నర్ర మామిడి చెక్క రూ. 32, విప్పగింజలు 23 రూపాయలు, ఇప్పపువ్వు రూ. 30, కానుగ గింజలు రూ. 10, నల్ల జీడిగింజలు రూ. 12 , కుంకుడు కాయలు 15 రూపాయలు నాణ్యమైన రేట్లు పెంచామని తెలిపారు. తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించరాదని తెలిపారు. అంతరిస్తున్న జీవనాధార వృక్ష సంపదను కాపాడడంతో పాటు ఉత్పత్తుల సేకరణతో గిరిజన ఆదాయం పెంచి లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.‌ ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు వజ్ర సాంబయ్య,  సతీష్, కాటాపూర్ జిసిసి సేల్స్ మెన్, బద్రు, ఆదివాసి నాయకుడు వట్టం బాలరాజు, ఉత్పత్తుల సేకరణ దారులు కొక్కెర సమ్మయ్య, వట్టం ముత్తయ్య గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love