– ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నవతెలంగాణ – గోవిందరావుపేట: రహదారి అభివృద్ధి పేరుతో రోడ్డును తవ్వారు గోతులు చేశారు. వర్షం పడింది ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. పనులు మాత్రం సాగడం లేదు. ఇది మండలంలోని పసర గ్రామంలో 163 వ జాతీయ రహదారి అభివృద్ధి భాగం. 163 వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సుమారు ఒక కిలోమీటర్ లోపు మేర పటేల్ అండ్ కంపెనీ ఫోర్ లైన్స్ పనులు నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాలు దాటిన ఈ పని పూర్తికాకపోవడం పటేల్ అండ్ కో కంపెనీ పనితనానికి నిదర్శనంగా మారింది. గత సంవత్సరం ఒకవైపు తప్పక సుమారు 10 నెలల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిర్మాణ పనులు కొనసాగించాలంటూ రహదారులు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. ఎట్టకేలకు ఆ సైడు పనులు పూర్తి చేసిన కంపెనీ ప్రస్తుతం గత వారం రోజుల క్రితం రెండవ సైడు కొంతమేర మట్టిని తవ్వి తీశారు.
ఈ ప్రాంతంలో ఉన్న మూడు వీధుల వాళ్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే 108 వాహనం కూడా రాని పరిస్థితి నెలకొన్నాయని వీధి ప్రజలు అంటున్నారు. వర్షం పడి నీరు నిలబడి పోవడంతో దుర్గంధం వేస్తోందని, మెయిన్ రోడ్డు ఎక్కేందుకు పోసిన అరకొర కంకర తో వాహనాలు దిగబడిపోయి ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. నేషనల్ హైవే అధికారులను సంప్రదించగా సంబంధిత ఏయి అడ్రస్ లేకుండా పోగా డిజి కుమారస్వామి సంబంధిత గుత్తేదారుతో మాట్లాడతాం అని అంటున్నారు. త్రాగునీరు అందించేందుకు వచ్చిన మినరల్ వాటర్ వాహనము కంకరలో దిగబడి పోగా దానిని తీసేందుకు జెసిబి తీసుకురావాల్సి వచ్చిందనీ వాటర్ ప్లాంట్ యజమాని తెలుపుతున్నారు.
ఇళ్లల్లోకి వెళ్లే వారి పరిస్థితి సర్కస్ చేసినట్లుగా ఉందని అంటున్నారు. ఇది కంప్లీట్ చేయడానికి మళ్లీ ఎన్ని నెలలు పడుతుందో ఎన్నిసార్లు ధర్నాలు రాస్తారోకోలు చేయవలసి వస్తుందోనన్న భయం ఆ ప్రాంత వాసులను వెంటాడుతోంది. అసలే ఎన్నికల సమయం కావడంతో ఏ ప్రజా ప్రతినిధి కూడా ప్రజల సమస్యను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు వెంటనే స్పందించి ఉత్తెదారితో సకాలంలో పనులు పూర్తి చేయించి ప్రజల కష్టాలను గట్టెక్కించాలని కోరుతున్నారు. రహదారి అభివృద్ధి వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. సమ్మయ్య పాత ఇనుము వ్యాపారి జాతీయ రహదారి అభివృద్ధి పేరుతో తీసిన గుద్దల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము.
నా జీవితంలో ఇంత ఆలస్యంగా పనులు నిర్వహిస్తున్న గుత్తేదారును ఇంతవరకు చూడలేదు. అధికారుల అలసత్వం వలననే గుత్తి దారు ఆలస్యంగా పనులు చేసిన నడుస్తోంది. అధికారుల మాటకు గుత్తేదారు కాదు కదా సిబ్బంది కూడా సమాధానం చెప్పరు. ప్రజలు ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. తవ్వడం గోతులు చేయడం నెలలు తరబడి సంవత్సరాల తరబడి మళ్లీ పని ప్రారంభించకపోవడం ఈ కాంట్రాక్టర్ కు వెన్నతో పెట్టిన విద్య గా మారింది. గతంలో కూడా అవతలి సైడు గోతులు తీసి సంవత్సరం తరబడి ఆపడంతో ధర్నాలు రాస్తారోకోలు ఎమ్మెల్యేకు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది చివరకు కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చిన సమయంలో పనులు పూర్తి చేయడం జరిగింది అప్పటిదాకా ఇబ్బందులు తప్పలేదు.