ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్ల గడ్డలో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన నల్లమాద లింగరాజుకు చెందిన దగ్ధమైన గడ్డివాము సుమారు రూ.25వేల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి  గడ్డివాము పూర్తి గా దగ్ధమైనట్టు తెలుస్తుంది. కాగా కాగా బాధితుడు మాట్లాడుతూ పశువుల ఆహార నిమిత్తం గడ్డిని నిలువ ఉంచినట్లు తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Spread the love