– నివాళలర్పించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, త్రిష
నవతెలంగాణ-వట్‌పల్లి
పశువులకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మేడుకుంద గ్రామంలో జరిగింది. మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లరేపల్లె చిన్న భూమయ్య(40) వ్యవ సాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే శనివారం మధ్యాహ్నం ఎడ్లకు నీళ్లు తాపించడానికి గ్రామ శివారులోని బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ప్రమా దవశాత్తు కాలుజారి బావి గుంతలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మతి చెందాడు. పత్తి చేన్లలో పశువులు తిరుగుతున్నప్పటికీ వ్యక్తి కనిపించ కపో వడంతో పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బావి వద్దకు వెళ్లి పరిశీలించగా.. బావిలో భూమయ్య మృతి చెంది కని పించాడు. ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోద రాజనర్సింహ కూతురు త్రిష. ఆందో ల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వేర్వేరుగాహాజరై.. నివాళ్లర్పించారు.