అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉచిత సర్జికల్ క్యాంపు ..

– మధ్యాహ్నం వరకు 18 మందికి సర్జరీ చేసిన…వైద్యులు 
– విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
అచ్చంపేట 100 పడకల ఆసుపత్రిలో ఉచిత సర్జికల్ క్యాంపు విజయవంతంగా కొనసాగుతుందని గురువారం కూడా 18 మందికి సర్జరీ చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.  నియోజకవర్గంలో ని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉచిత వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది… మెగా సర్జికల్ క్యాంపు ద్వారా ఇప్పటివరకు 1230మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారందరికీ కూడా ఉచితంగా సర్జరీ చేయడం జరుగుతుందన్నారు.  ఆపరేషన్ లో ఏమైనా పెద్ద  సర్జరీలు ఉంటే హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ l పంపించి సర్జరీ చేపించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం లోని ప్రజలు ఏ ఒక్కరు కూడా వైద్యపరంగా ఇబ్బంది పడకుండా ఉచితంగా అన్ని రకాల ఆపరేషన్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత సర్జికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అచ్చంపేట ఏరియా హాస్పిటల్ రకాల విభాగాలు, వైద్య సిబ్బంది పారామెడికల్ స్టాఫ్ ను వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతామన్నారు.రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ  దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆరోగ్య మంత్రి  త్వరలో అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఆమీంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరీడెంట్ డాక్టర్ ప్రభు, వైద్య బృందం ఉన్నారు.
Spread the love