బుర్కగడ్డ మీద అషూలియన్‌ రాతి పనిముట్టు

వికారాబాద్‌ జిల్లా దోమ మండలం, కొత్తపల్లి గ్రామానికి, కులకచర్ల మండలం చెల్లాపూర్‌ గ్రామానికి శివారు ప్రాంతం బుర్కగడ్డలో రైతుల వ్యవసాయభూమి నివాసాలున్న చోట, దాదాపూర్‌ జి.ప.ఉ.పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అబ్బాయి దొబ్బలి శివకుమార్‌కు దొరికిన ఈ రాతిపరికరాన్ని ఎ.శాంతకుమార్‌, ఎం.కృష్ణ- ఉపాధ్యాయులు, కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులకు చూపించాడు. ఈ రాతిపనిముట్టు పొడవు 12.5 సెం.మీ., వెడల్పు 8.5సెం.మీ., మందం 3.5 సెం.మీ.లున్నాయి.
ఈ రాతిపనిముట్టు లభించిన ప్రదేశానికి ఉత్తర, దక్షిణాలలో చిన్నగుట్టలున్నాయి. దక్షిణం గుట్ట పూర్తిగా ‘పలుగు(Quartz) రాళ్ళ’తో నిండివుంది. ఉత్తరాన గ్రానైట్‌ రాళ్ళగుట్ట కనపడుతున్నది. పడమర లోతట్టుప్రాంతంలో నీటికుంట వుంది.
ఈ రాతిపరికరం (Rock Tool) ఫొటోలను అంతర్జాతీయ ప్రాక్చరిత్రకారుడు రవికొరిసెట్టర్‌ (కర్ణాటక), శ్రీరామోజు హరగోపాల్‌, కన్వీనర్‌, కొ.తె.చ.బందం పరిశీలించి, అది తొలి పాతరాతియుగం లేదా అషూలియన్‌ రాతిపనిముట్టు రాతి గొడ్డలిగా నిర్ధారించారు.
సెయింట్‌-అషూలియల్‌ యొక్క టైప్‌ సైట్‌ తర్వాత ఫ్రెంచ్‌ అషూలీన్‌ నుండి వచ్చిన అషూలియల్‌, రాతి పనిముట్ల తయారీకి సంబంధించిన ఒక పురావస్తు పరిశ్రమ, ఇది హోమో ఎరెక్టస్‌తో అనుబంధించబడినదని, ఈ పనిముట్టు వయసు కనీసం లక్షసంవత్సరాలకు ముందటిదేనని శ్రీరామోజు హరగోపాల్‌ చెప్పారు.
ఆధారం:
– Acheulean (1.76-0.13 Ma)
– Madrasian (1.5 Ma)
– Soanian (500-130 ka)
– Clactonian (424-400 ka)
– Mugharan (400-220 ka)
క్షేత్ర పరిశీలన: ఎ.శాంతకుమార్‌, ఎం.కృష్ణ, 8008992416
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు-విషయనిపుణులు: గౌరవనీయ అంతర్జాతీయ ప్రాక్చరిత్రకారులు రవి కొరిసెట్టర్‌, కర్ణాటక
శ్రీరామోజు హరగోపాల్‌,
కన్వీనర్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం-9949498698

Spread the love