మంత్రాల నెపంతో దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలి

– సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జాతీయ సమన్వయకర్త చార్వాక
నవతెలంగాణ-కొత్తగూడెం
మంత్రాల నెపంతో దాడి చేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జాతీయ సమన్వయకర్త చార్వాక ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిలా, నర్మెట్ట మండల కేంద్రంలో నక్కల సత్తెమ్మ అనే మహిళపైన బంధువులు నక్కల రవి మంత్రాలు చేస్తున్నారని నెపంతో బుధవారం అర్ధరాత్రి గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నక్కల రవి తన భార్య. తన పిల్లలు ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురి కావడంతో దానికి కారణం తన సమీప బంధువులైన నక్కల సత్తమ్మ తరచూ వారి ఇంటికి వస్తుండడం సత్తమ్మ తన భార్య పిల్లలకు మంత్రాలు చేసి అనారోగ్యానికి గురయ్యేట్టు చేసిందని అనుమానంతో నక్కల రవి మహిళ పైన దాడి చేశాడు. మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకువచ్చి అసెంబ్లీలో ఆమోదించి, ఆచరణలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. దాడి సంఘటన జరిగిన మండల కేంద్రంలో కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి మూఢనమ్మకాల పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సైతం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love