విశ్వశాంతి విద్యాసంస్థపై బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలి..!

– ఏఐపిఎస్యు జిల్లా కార్యదర్శి జ్వాల

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని నిన్న నాగారం ప్రాంతంలో చైతన్య పాఠశాలకు చెందిన ఆరు సంవత్సరాలు హయాతి పి పి 1 చదువుతుంది. నిన్న సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బస్సులో నాగారం బయలుదేరి బస్సు దిగి ఇంటికి వెళుతున్న సందర్భంలో వెనకనుంచి నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా వస్తున్న విశ్వశాంతి విద్యాసంస్థల బస్సు విద్యార్థిని ఢీ కొట్టడం జరిగింది. అక్కడికక్కడనే ఆ చిన్నారి మృతి చెందడం జరిగింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది . ప్రతిరోజు వెళ్తున్నటువంటి బస్సుకు రోజు ఎలాంటి ప్రమాదంలో అయితే జరిగినటువంటి పరిస్థితులు ఉండవు రోజు వెళ్తున్నటువంటి దారిలోనే హఠాత్తుగా ప్రమాదం జరిగి విద్యార్థి మృతికి కారణం అవ్వడానికి గల పరిస్థితులు ఏంటో తెలియాల్సి ఉంది దీనిపైన జిల్లా విద్యాశాఖ ఎంఈఓ  డీఈవో  ఎంక్వయిరీ జరిపి బస్సు గనక ఏమన్నా రిపేర్లు ఉన్న లేదా దాని యొక్క ఫిట్నెస్ లోపాలున్న లేదా లైసెన్సు లేని డ్రైవర్ గనక వెళ్లినట్లు అయినా కచ్చితంగా ఆ యొక్క స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని ఏఐపీఎస్సీ విద్యార్థి సంఘంగా కోరడం జరిగింది అదేవిధంగా మరణించినటువంటి విద్యార్థిని కుటుంబానిటేకి 30 లక్షల రూపాయల నష్టపరిహానాన్ని ఇవ్వాలని అదేవిధంగా విశ్వశాంతి స్కూల్ పైన విద్యాశాఖ నుంచి ఎంక్వయిరీ చేసి ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించాలని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా స్కూల్ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. పోలీసు శాఖకు సంబంధించి డ్రైవర్ పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ విద్యాశాఖ నుండి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం బససుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఆరా తీయలేదు. కాబట్టి విద్యాశాఖ కూడా వారి యొక్క పనిని సక్రమంగా చేసి పాఠశాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
Spread the love