తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం తప్పదు

– వీర్లపల్లి శంకర్‌పై తప్పుడు ప్రచారం సరికాదు
– టీపీసీసీ సభ్యులు మహమ్మద్‌ అలీ ఖాన్‌ బాబర్‌
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం తప్పదని, కాంగ్రెస్‌ అభ్యర్థిని మారుస్తు న్నారని సోషల్‌ మీడియాలో వచ్చిన వార్త అవాస్తవమని టీపీసీసీ సభ్యులు మహమ్మద్‌ అలీఖాన్‌ బాబర్‌ అన్నారు. గురువారం వీర్లపల్లి శంకర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీర్లపల్లి శంకర్‌ పై తప్పుడు ప్రచారం సరికాదని, అధికార పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థిని మారుస్తున్నారని ప్రచారం చేయడం హేయమైన చర్య అని అన్నారు. పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ మార్పు కోసం ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున వీర్లపల్లి శంకర్‌ ఉద్యమిస్తున్నారని, గ్రామాలకు గ్రామాలు కాంగ్రెస్‌ పార్టీలో కలుస్తున్నాయని ఇలాంటి సమయంలో శంకర్‌కు వస్తున్న ఆదరణ చూడలేక ఓ ఛానల్‌ ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు రఘు, కృష్ణారెడ్డి, అసద్‌ ముక్తార్‌ అలీ, చెన్నయ్య, బాలరాజ్‌ గౌడ్‌, శీను నాయక్‌, దర్శన్‌, హుస్సేన్‌, ప్రదీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love