మారుముల ప్రాంతంలో మెచ్చా ప్రచారం

నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని పుసుకుంట పంచాయతీలో అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను అలాగే పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ప్రతి ఒకరితో ఆత్మీయంగా మాట్లాడుతూ సమయం గడిపారు. అలాగే సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తమ గ్రామానికి అభివృద్ధి జరిగిందని, తప్పకుండా రానున్న ఎన్నికలో ఎది ఏమైనా ఓటు మాత్రం కారు గుర్తుకే వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు, ఎంపీటీసీ సోడెం మహాలక్ష్మి, గంగరాజు, సర్పంచ్‌, బోలికొండ ప్రభాకర్‌, రాయల నాగేశ్వరరావు, దొడ్డ నాగేశ్వరరావు, బాల శ్రీను, యువ నాయకులు, తదితరులు ఉన్నారు.

Spread the love