బీఆర్ఎస్ లోకి చేరికలు

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన 15 మంది యువత బిజెపి ,కాంగ్రెస్ పార్టీలు వీడి శుక్రవారం రాష్ట్ర యువ నాయకుడు సతీష్ రెడ్డి, సర్పంచ్ కుమ్మరి కుమార్, గ్రామ అధ్యక్షుడు అచ్చం గారి రాజు ఆధ్వర్యంలో పోతారం గ్రామంలో ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాకలో  తన గెలుపు కోసం పనిచేయాలని, గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కో ప్రభాకరుడై ఇంటింటా ప్రచారం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామనుజం గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు కుమ్మరింకు శ్రీనివాస్ ,జనగామ పరశురాములు, చుక్క వెంకటస్వామి, పట్నం రామస్వామిలు ఉన్నారు.
Spread the love