అధికారంలోకి రాగానే రుణమాఫీ, రైతు బంధు: బీఆర్ఎస్

నవతెలంగాణ – చిన్నకోడూరు

అధికారంలోకి రాగానే రుణమాఫీతో పాటు రైతు బంధు డబ్బులు అకౌంట్ లలో జమ చేస్తామని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండల పరిధిలోని మల్లారం, సికింద్లాపూర్ గ్రామాలలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు సిద్దిపేట శాసన సభ బిఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు పక్షాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకమనీ, కానీ నేడు కాళేశ్వరం ద్వారా సాగు నీరు, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు బంధు, రైతు భీమా ఇస్తున్న ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలులో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతీ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అర్హులైన దళితులకు విడతల వారిగా దళిత బంధు అందజేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి హరీశ్ రావుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్ పర్సన్ వనిత రవీందర్ రెడ్డి, బారాస మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆకుల సుశీల, పిఏసిఎస్ చైర్మన్లు సదానందం గౌడ్, ములుకల కనకరాజు, వైస్ ఎంపిపీ కీసరి పాపయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాముని ఉమేష్ చంద్ర, మల్లారం గ్రామ సర్పంచ్ చుంచు జ్యోతి ఆంజనేయులు, సికింద్లాపూర్ సర్పంచ్ మొసర్ల జయవర్ధన్ రెడ్డి, ఎంపిటిసి బాలయ్య, బారాస సీనియర్ నాయకుడు ముక్కిస సత్యనారాయణ రెడ్డి, మండల మహిళా ఉపాధ్యక్షురాలు గాంధారి సరోజన, కార్యదర్శి రేగుల శివ్వమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love