కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన..

– ఆకుతోటబావితండా గిరిజన రైతుల వడ్లు కొనుగోలు చేసి సకాలంలో లారీలు పంపాలని ధర్నా..
– కొనుగోలు చేస్తామని హామీతో ధర్నా విరమణ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై, కోనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయకపోవడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి మండలంలోని ఆకుతోట బావి తండాకు చెందిన రైతులు భువనగిరి  కలెక్టరేట్ ఎదురుగా ధాన్యం రాశులను ఆరబోసి,   రైతులు ఆందోళన చేశారు. మహిళ సంఘాల సభ్యులు మహిళ రైతులు  బస్తాల ద్వారా రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన అధికారులు వచ్చి కోనుగోలు చేసిన బస్తాలను వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీలను ఏర్పాటు చేస్తామని, తడిసిన.  ధాన్యాన్ని కూడా కోనుగోలు చేసి , వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వెంటనే ఏటిబి తండా కొనుగోలు కేంద్రాల్లో లారీలను ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో రైతులు సుధాకర్, శ్రీనివాస్, లక్ష్మణ్, ఉమ్లా నాయక్, రవిందర్, దేవేందర్, సాగర్, లాలు, రవిందర్, రమేష్, రాములు, శాంతమ్మ, పద్మా, సుగుణ, సుజాత , బుజ్జి, లక్ష్మి, నరేష్, శ్రీనివాస్, శ్రీశైలం, బిచ్చపతి లు పాల్గొన్నారు.
Spread the love