Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండేగావ్ లో వ్యవసాయ విద్యుత్తు నియంత్రణ అపహరణ

చండేగావ్ లో వ్యవసాయ విద్యుత్తు నియంత్రణ అపహరణ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని చండేగావ్ గ్రామ శివారులోని రైతుల వ్యవసాయ విద్యుత్తు నియంత్రికను గుర్తుతెలియని వ్యక్తులు ఆగస్టు 3 రాత్రి సమయంలో అపహరించారని రైతులు తెలిపారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 2న పొలం పనులు ముగించుకొని సాయంకాలం ఇంటికి వెళ్లన సమయంలో ట్రాన్స్ ఫార్మ్ ఉందనీ, ఉదయం గడ్డి కోసేందుకు వ్యవసాయ భూమికి వెళ్లడంతో ట్రాన్స్ఫారం మొత్తం పొలంలో చెల్లాచెదురుగా పడి ఉండడంతో అవాక్కైన రైతు వెంటనే చుట్టుపక్కల ఉన్న రైతులకు, సర్పంచ్ లక్ష్మణ్ కు తెలియజేశారు. దీంతో సర్పంచ్ వెంటనే ట్రాన్స్కో అధికారులతో మాట్లాడడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. అయితే రైతులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే తిరస్కరించారని, అనంతరం 100 నెంబర్ కు డయల్ చేయడంతో జుక్కల్ పోలీసులు స్పందించి బుధవారం విచారణ చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో సర్పంచ్ సమక్షంలో విచారణ ప్రారంభించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -