– యూనియన్ మరింత బలోపేతం
నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ కార్మిక సంఘాల్లో కీలక పరిణామంగా, ఏఐటీయూసీ అధ్యక్షుడు నర్సింగరావు తన అనుచరులతో కలిసి మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ( సిఐటీయూ ) యూనియన్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కందారం రాజనర్సు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వారికి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కందారం రాజనర్సు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ నుంచి నర్సింగరావుతో పాటు మరికొందరు కార్మికులు సిఐటీయూలో చేరడం సంతోషకరమని తెలిపారు.
వారి చేరికతో యూనియన్ మరింత బలపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా చేరిన వారందరికీ స్వాగతం పలికారు. నూతనంగా చేరిన నర్సింగరావు మాట్లాడుతూ.. తాము తమ స్వంత నిర్ణయంతో సిఐటీయూలో చేరడం గర్వంగా ఉందని తెలిపారు. సిఐటీయూను తమ మాతృసంస్థగా భావిస్తున్నామని, యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కార్మికుల హక్కుల కోసం చురుకుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి మహబూబ్ అలీ, సిఐటీయూ మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి, వాటర్ వర్క్స్ అధ్యక్షులు మీర్జా ఆయాజ్ బేగ్, ప్రధాన కార్యదర్శి పోతారం ప్రభాకర్, ఉపాధ్యక్షులు వై. రాజు, సహాయ కార్యదర్శి కాట్రాల ప్రభు, నాయకులు కూరాకుల లింగం, నూతనంగా చేరిన వారు కొత్తూరు ప్రకాష్, కళ్యాణ్, సంతోష్, శ్రీకాంత్, బాలరాజ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.



