కన్నౌజ్‌ నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ గురువారం యూపీలోని కన్నౌజ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి ఎంతో పట్టున్న కన్నౌజ్‌ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు విజయం సాధించారు. 2012, 2014 ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌ గెలిచారు. 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పాథక్‌ చేతిలో ఆమె ఓటమిని చవిచూశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు అనంతరం అఖిలేశ్‌ మాట్లాడుతూ ఎస్పీ చేపట్టిన అభివద్ధిని బీజేపీ ఉద్దేశపూర్వకంగా నిలువరి స్తోందని ఆరోపించారు. అంతేకాకుండా నెగెటివ్‌ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజలను పదేపదే అవమానిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కన్నౌజ్‌ ప్రజలకు సేవలందించేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఎస్పీ హయాంలో కన్నౌజ్‌లో జరిగిన అభివద్ధి ప్రజలకు తెలుసునని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ నియోజకవర్గం నుంచి అఖిలేశ్‌ మేనల్లుడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అల్లుడైన మాజీ ఎంపీ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పోటీ చేస్తారని పార్టీ వర్గాలే ప్రకటించాయి. ఇక పార్టీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేశ్‌ పోటీలో ఉండాలని నిర్ణయించారు.

Spread the love