నియామో: నైజర్ లో ఘోరం జరిగింది. గురువారం రాజధాని నియామేలోని దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సైనిక వైమానిక స్థావరాలపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని తామే చేశామని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్- ఇస్లాం వల్ ముస్లిమిన్ ( జేఎన్ఐఎం) ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 6 గంటల సమయంలో మొదలైన ఈ దాడి రెండు గంటలకు పైగా కొనసాగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మృతుల్లో 11 మంది సైనికులు కాగా.. మరో ఇద్దరు సాధారణ పౌరులని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడిని భద్రత బలగాలు తిప్పికొట్టాయని.. 22 మంది దుండగులను హతమార్చారని తెలిపింది. మరికొందరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు పదుల సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపింది. తాజా దాడి నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమాన రాకపోకలు కూడా పునఃప్రారంభమయ్యాయని నైజర్ పౌర విమానయాన సంస్థ పేర్కొంది. ఈ దాడిని తామే చేశామని జేఎన్‌ఐఎం ప్రకటించుకుంది. సోషల్ మీడియాలో చేసిన ఓ ప్రకటనలో విమానాశ్రయం, దాని సమీపంలోని ఓ సైనిక స్థావరంపైనా ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పేర్కొంది. కాగా.. ఈ విమానాశ్రయ ప్రాంగణంపై దాడి జరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ఇస్లామిక్ స్టేట్ సాహెల్ ప్రావిన్స్ అనే సంస్థ దీన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది.
నైజర్ ఎయిర్‌పోర్టుపై అల్‌ఖైదా ఉగ్రదాడి 32 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



