ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలి: వెంకయ్య నాయుడు

నవతెలంగాణ – హైదరాబాద్: మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ‘మాతృభాషలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం గొప్ప విషయం. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలి. ఆ తర్వాతే ఆంగ్లంలో ఉండాలని కోరుతున్నా. నేను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు’ అని తన జీవితంపై రూపొందించబడిన పుస్తకాల విడుదల సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

Spread the love