నాగార్జున సాగర్లో జరిగిన అభివృద్ధి అంతా జానారెడ్డి చేసిందే.. కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్

నవతెలంగాణ -పెద్దవూర: నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కంటికి కనిపిస్తున్న అభివృద్ధి అంతా మాజీ మంత్రి జానారెడ్డి హయాంలోనే జరిగిందే తప్ప బీఆర్‌ఎస్‌ పాలనలో ఏమీ జరుగ లేదని కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిడమనూరు మండలం లోని నందికొండ వారి గూడెం, లక్ష్మిపురం, ఊటుకూరు, మారేపల్లి గ్రామం లో ప్రచారం లో పాల్గొని మాట్లాడారు.పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏఒక్క హమీ నెరవేర్చలేదు. ప్రజలను నమ్మిచి మోసం చేసి మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రి కావాలని వస్తుండని విమర్శలు చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్దే తప్ప బీఆర్‌ఎస్‌ చేసింది ఏమీ లేదని అన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజల అకాంక్షలు నెరవేరలేదని తెలిపారు. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల రాజ్యం కులాలి. ఇవి దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణా కు మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలోనే రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అని అన్నారు. ఆ నలుగురి ఉద్యోగం ఊడకొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.ఇందిరమ్మ పథకాలు రావాలంటే బీఆర్‌ఎస్‌ పాలన పోయి కాంగ్రెస్‌ పాలన రావాలి.ప్రజలను వంచనకు గురిచేస్తున్న బీఆర్‌ఎస్‌ పాలన ను పాతరేయం ఖాయమని ఆ తర్వాత వచ్చే కాంగ్రెస్‌ పాలనలోనే పూర్వ వైభవం వస్తుందని అన్నారు. దళితబందు పథకం వారే పంచుకున్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి తాగుబోతుల తెలంగాణ మార్చిండని అన న్నారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఆరు గ్యారేంటీలను అమలు చేసి తిరుతామని అన్నారు. రు.500 లకే గ్యాస్ సిలెండర్, మహిళలకు ప్రతి నెల రు.2500 లు, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రు.5,00,000 లు, అందిస్తామన్నారు. ఆరోగ్య పథకం ద్వారా రు.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరుతో 67 అంశాల తో మేనిఫెస్టో తయారు చేశామని వాటిని అమలు చేస్తామని తెలిపారు.  ప్రతి నెల 4000 లు అందిస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్ళికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, అలాగే రైతులకు ఒకే సారీ 2,00,000 రుణమాపి చేస్తామని తెలిపారు.200 ల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ బిల్లు అమలు,నిరద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జెడ్పిటి సినందికొండ రామేశ్వరి మట్టారెడ్డి, సర్పంచ్ నర్సింగ్ విజయ్ కుమార్, ఎంపీటిసి సూరుగూరు చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపి మీరెడ్డి వెంకట్ రెడ్డి మహిళలు, యువకులు, ప్రజలు వున్నారు.

Spread the love