అమెజాన్ కీలక నిర్ణయం..మే 31 నుంచి.!

నవతెలంగాణ – న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ధరలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఇక ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా వంటి కంపెనీలైతే కస్టమర్లను ఆకర్షించేందుకు మరిన్ని ఆఫర్లు అందిస్తుంటాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై ఫ్రీగా షాపింగ్ చేసే అవకాశం ఉండడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. అయితే అమెజాన్‌ వెబ్‌సైట్‌పై ఇష్టంగా షాపింగ్‌ చేసేవారు ఇకపై ఫ్రీగా షాపింగ్ చేయలేరు. అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుందని పేరున్న అమెజాన్ సేల్స్ ఫీజులు, కమిషన్ ఛార్జీలను సవరించాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్, కాస్మోటిక్స్‌తోపాటు కొన్ని కేటగిరీల వస్తువులపై మే 31 నుంచి కొత్త ఛార్జీలు విధించాలని భావిస్తోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై వస్తువుల విక్రయించే వ్యాపారస్థుల నుంచి కమిషన్లు, ఇతర ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. అమెజాన్ ప్రకారం.. మార్కెట్‌ను బట్టి రేట్లు మారుతుంటాయి. అమెజాన్ నిర్ణయం ధరలపై నేరుగా ప్రభావం చూపుతుందని ఒక విక్రయదారుడు పేర్కొన్నారు. కమిషన్ ఛార్జీల పెరుగుదల విక్రేతల్లో మార్పునకు కారణమవ్వొచ్చని తెలిపారు. కాగా దుస్తులు, బ్యూటీ ప్రొడక్టులు, గ్రాసరీస్, మెడిసిన్స్‌తోపాటు పలు వంటి వస్తువులపై అమెజాన్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది.

Spread the love