– తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాంటీ అంబేద్కర్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ భూమి మీద ఎవరైనా అంబేద్కర్ వ్యతిరేకి ఉన్నారంటే, అది రేవంత్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అర్థరాత్రి 12 గంటలకు యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకల్లో ఆమె మాట్లాడారు. బాబా సాహెబ్ జయంతి సందర్భంగా ఈ ముఖ్యమంత్రికి బుద్ది వచ్చి పేదలకు న్యాయం చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు…ఒక ఐడియాలజీ, ఒక థాట్ అని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందితేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన బాబా సాహెబ్ మహిళల కోసం ఎంతో చేశారని గుర్తు చేశారు. నల్లమలలోని సహజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…చెంచులను బలి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కడిచింతలపైలు, సార్లపల్లి చెంచు పెంటల్లో 200లకు పైగా చెంచు కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నారు.
నోరు లేని అడవి బిడ్డలకు అక్కడ ఉండే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అడవి బిడ్డల తరఫున జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కవిత
రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చాదర్ పంపారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మైనార్టీ నాయకులకు అందజేశారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ, ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా కవిత చెప్పారు.
అంబేద్కర్ సాధారణ వ్యక్తి కాదు…ఒక ఐడియాలజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



