Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం23,24,25 తేదీల్లోతెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ

23,24,25 తేదీల్లోతెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహణ : రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని, టి.సాగర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 23,24,25 తేదీల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ నిర్వహించనున్నామనీ, వాటిని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ రెడ్డి, పి జంగారెడ్డి, అరిబండి ప్రసాద రావు, వర్ణ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్‌ శోభన్‌, లెల్లెల బాలకృష్ణ, బొంతు రాంబాబు, మాటూరి బాలరాజు గౌడ్‌, ఈసంపెల్లి బాబు, ఎం శ్రీనివాసులు, పల్లపు వెంకటేష్‌, రాపర్తి సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వాసిరెడ్డి ప్రసాద్‌, మీరాసాహెబ్‌, మల్లు నాగార్జున రెడ్డి, కొప్పుల రజిత, కందాల శంకర్‌ రెడ్డి, పారేపల్లి శేఖర్‌ రావు, దేవిరెడ్డి అశోక్‌ రెడ్డి, మేక అశోక్‌ రెడ్డి, భూక్యా చందు నాయక్‌, నల్లపు సుధాకర్‌, రాజారావు, తిరుపతి రెడ్డి, మిల్కురి వాసుదేవారెడ్డి, రావుల జంగయ్య, బాలరెడ్డి, బండి రమేష్‌, దశరథం తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం పోతినేని సుదర్శన్‌రావు, టి.సాగర్‌ మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదన్నారు. ఓవైపు ప్రకృతి వైఫరీత్యాలు, మరోవైపు పాలకుల నిర్లక్ష్యం కలిసి రైతన్నలను అప్పుల ఊబిలోకి నెడుతున్న తీరును వివరించారు. అన్నదాతకు న్యాయం జరగాలంటే పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకుల వేధింపులు పెరిగిపోతున్నాయని చెప్పారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాల పంపిణీలో జరుగుతున్న జాప్యంతో అటవీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

అసలైన సాగుదారులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. 23న ప్రారంభ సభలో ఏఐకేఎస్‌ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ దావలే, ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్‌, జాతీయ నాయకులు దేశవ్యాప్త రైతు ఉద్యమ అనుభవాలను, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిణామాలను వివరిస్తారన్నారు. 24న 33 జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు. మూడేండ్లలో జిల్లాలు, మండలాల వారీగా జరిగిన ఉద్యమాలపై చర్చిస్తామన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, కార్పొరేట్‌ శక్తుల చొరబాటుపై చర్చాగోష్ఠులు జరుగుతాయని తెలిపారు. 25న భవిష్యత్‌ కార్యాచరణతో నూతన కమిటీ ఎన్నిక ఉంటుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -