నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన మూసీ పోరుబాట కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ముగిసింది. పది రోజులపాటు విద్యార్థులు పోరుబాట నిర్వహించి అంబేద్కర్ జయంతి సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో ఉన్న 125 అడుగుల విగ్రహం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లక్షలాది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మంజూరు చేయని సీఎం రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ పేరుమీద ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాహితానికి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ పేరుమీద నిధులు వృధా చేయొద్దని కోరారు. ఈ ప్రాజెక్ట్ అంబేద్కర్ ఆర్థిక విధానానికి వ్యతిరేకమనీ, ప్రజా ప్రజా ప్రయోజనం లేని ప్రాజెక్టుల వల్ల ప్రజలమీద ఆర్థిక భారం వేసే నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. సుందరీకరణ పేరుమీద భారీ దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. త్వరలో నగరంలో మూసి నిర్వాసితుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బలి కాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముగిసిన బీఆర్‌ఎస్వీ మూసీ పోరుబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



