
నవతెలంగాణ – బెజ్జంకి
లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం నిర్వహించిన శకటోత్సవం(గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట)ఘట్టం అంగరంగ వైభవంగా ప్రారంభమవ్వగా పోలీసుల బందోబస్తు మద్య అంభరంగా నిర్వహించారు.మండలంలోని అయా గ్రామాల నుండి ఎండ్ల బండ్లు,వాహనాలు అధిక సంఖ్యలో తరలిరావడంతో శకటోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ శ్రీను,ఎస్ఐ క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోప్ సహయంతో బెజ్జంకి,చిన్నకోడూర్,రాజగోపాల్ పేట,సిద్దిపేట రూరల్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. శకటోత్సవంలో మేకల బండి ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.
జాతరలో ప్రత్యేక నిఘా..
గురువారం ఉదయం నిర్వహించనున్న రథోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో హజరవ్వనున్న దృష్ట్యా పోలిసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.