ప్రాణాలతో బతికే ఉన్నారా..?
బంధువుల వెతుకులాట
వెనిజులా భూకంపంలో 589 కి పెరిగిన మృతులు
గాలింపు చర్యలకు 17 దేశాల నుంచి సహాయక బృందాలు. యూఎన్
భారత్ నుంచి వైద్యబృందాలు.. సామాగ్రి
కార్కస్: వెనిజులాను మరుభూమిగా మార్చిన భూ ప్రకంపనల నుంచి ఇప్పటికీ తేరుకోలేదు. రెండోరోజైన శుక్రవారం శిధిలాల్లో ఉన్న జనాన్ని కాపాడేపనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా మరణించిన వారి సంఖ్య 589కి పెరిగిందని, 2,980 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగెజ్ తెలిపారు. ‘ఆపరేషన్ అమిస్టాడ్’లో భాగంగా మానవతా సహాయక చర్యలకు మద్దతుగా, భారత సైన్యానికి చెందిన ’60 పారా ఫీల్డ్ హాస్పిటల్’ నుండి తొమ్మిది మంది వైద్య అధికారులతో కూడిన 41 మంది సభ్యుల బృందం వెనిజులాకు చేరుకున్నది.వినాశకరమైన జంట భూకంపాల తర్వాత ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలించేందుకు కనీసం 17 దేశాల నుంచి అంతర్జాతీయ గాలింపు , సహాయక బృందాలను వెనిజులాకు పంపుతున్నట్టు ఐక్యరాజ్యసమితి శుక్రవారం తెలిపింది. శిధిలాల్లో చిక్కుకున్న వారి గాలింపుకోసం సహాయక బృందాలను ఘటనా స్థలానికి చేర్చడమే “అత్యంత ప్రాధాన్యత” అని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల విభాగం ( ఓసీహెచ్ ఏ) పేర్కొంది.మృతుల సంఖ్య పెరుగుతుండగా, తమ వారి కోసం వెనిజులా శిథిలాల మధ్య చిక్కుకున్న తమ బంధువులను స్థానికులు గాలిస్తున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. “చిక్కుకుపోయిన ప్రజలను మేం రక్షించబోతున్నాం” అని డెల్సీ రోడ్రిగెజ్ అన్నారు. “మేము ఈ పని మీద అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం.” బుధవారం సాయంత్రం సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల భూకంపాల వల్ల లా గువైరా రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిందని, సహాయక బృందాలు ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తూ, ఆహారం , నీటిని పంపిణీ చేస్తున్నందున ఆ ప్రాంతాన్ని సైనికీకరించారని ఆమె పేర్కొ న్నారు.వేలాది మంది గల్లంతైనట్లు నివేదికలు రావడం మరియు ముమ్మర సహా యక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
శిధిలాల్లోనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



