భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ వైదేవీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. నెల 15వ తేదీన ప్రారంభం 2వ తేదీ వరకు వారం రోజులపాటు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించినట్లు, అంగన్వాడి కేంద్రంలో పిల్లల సంఖ్య పెంచేలా అవగాహన కల్పించినట్లు తెలిపారు. 30 నెలల నుంచి అంగన్వాడి కేంద్రానికి పంపించాలని నర్సరీ క్లాసులు ఉంటాయని, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ బాల లక్ష్మి, ఆయా గౌరమ్మ, అంగన్వాడి పిల్లల తల్లులు పాల్గొన్నారు.