కవలలకు జన్మనిచ్చిన ఏనుగు..

నవతెలంగాణ –  ధాయ్ లాండ్ : థాయ్‌లాండ్‌లో ఓ ఏనుగుకు కవల పిల్లలు జన్మించాయి. ఇందులో ఆడ, మగ ఏనుగు ఉన్నాయి. రాయల్ క్రాల్‌లోని ఆయుత్తాయ ఎలిఫెంట్ ప్యాలెస్‌లో చంచూరి (35) అనే ఏనుగుకు ఒకదాని తర్వాత ఒకటి జన్మించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఏనుగులకు కవలలు జన్మించేందుకు ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అవి 22 నెలలపాటు గర్భధారణతో ఉంటాయి. నాలుగేళ్లకోసారి పిల్లలకు జన్మనిస్తాయి.

Spread the love