
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కి నిజాయితీగల వారిని వైస్ ఛాన్సలర్ గా నియమించాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ తే. యూ పి.డి.ఎస్.యూ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు అన్ని యూనివర్సిటీలను బ్రష్టు పట్టించారని ,గత సీఎం యూనివర్సిటీ లనుపట్టించుకోకుండా విద్వంసం చేశారనీ, యూనివర్సిటీలను రక్షించాల్సిన బాధ్యత, అధిక నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్నిదేనని పేర్కొన్నారు. గతంలో యూనివర్సిటీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని, దానికోసం తెలంగాణ యూనివర్సిటీకి వంద కోట్లు నీదులు కేటాయించి అభివృద్ధి కి పాటుపడాలని ,మంచి నీతిమంతులను వైస్ ఛాన్సలర్ గా తీసుకురావాలని, నిర్ణయాలను ఎప్పటికప్పుడు అమలు చేసే వారిని విసి ,రిజిస్టర్ లుగా నియమించాలని ,గతంలో పాలకమండలి చేసిన నిర్ణయాలను అమలు చేయలేదని, అవినీతి వీసి దొరికిన యూనివర్సిటీని ప్రక్షాళన చేయలేదని అన్నారు .యూనివర్సిటీల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు, పరిశోధనల మీద నైపుణ్యత, నిజాయితీగలవారిని వైస్ ఛాన్సలర్ గా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి.డి. ఎస్.యూ నాయకులు రవీందర్,వంశీ, గోపి, రాజు, తదితరులు పాల్గొన్నారు.