ఇందల్ వాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా అనంతరావు బుధవారం భాద్యతలు స్వీకరించారు. ఎలక్షన్ కమిషనర్ అదేశాల మేరకు బదిలీల్లో భాగంగా ఆయన కామారెడ్డి జిల్లాలోని బిక్ నూర్ నుండి ఇందల్ వాయి మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.వీదుల్లో చేరిన ఎంపీడీఓ కు కార్యలయ సిబ్బంది స్వాగతం పలికి పుల బోకే, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సిబ్బంది పరిచయం చేసుకున్నారు. ఇందల్ వాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాములు నాయక్ నిర్మల్ జిల్లాలోని ముధోల్ కు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత రావు మాట్లాడుతూ.. వచ్చే వేసవిలో త్రాగు నీటి కి ప్రజలు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు చేపడతామని, ఎ సమస్య ఉన్న నేరుగా ప్రజలు వచ్చి కలవలని సూచించారు. అందరి సహాయ సహకారాలతో మండలాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ విమలా దేవి,పంచాయతీ కార్యదర్శులు,ఈజీఎస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.