నులిపురుగుల మాత్రలవలన రక్తహీనత తగ్గుతుంది 

– నేడు విద్యార్థిని విద్యార్థులకు నులిపురుగు మాత్రలు వేయించాలని ర్యాలీ 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
నులిపురుగు మాత్రణ వలన రక్తహీనత తగ్గుతుందని మండల వైద్యాధికారి రవీందర్ బుధవారం అన్నారు. జాతీయ నిలుపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 20న ప్రతి అంగన్వాడి కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో హైస్కూలలోని విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఉచితంగా వేయడం జరుగుతుందని మండల వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రధాన వీధుల గుండా వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. నులిపురుగు మాత్రమే ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసుగల విద్యార్థులు విద్యార్థులకు ఉచితంగా ఆయా పాఠశాలల్లో అందించడం జరుగుతుంది అని తెలిపారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు పాటించి విద్యార్థులు మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేయించుకోవాలని తెలపాలన్నారు. చేతి వేళ్లకు ఉన్న గోర్లను ఎప్పటికీ ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో ఎటువంటి రోగాలు రావని, రక్తహీనత కు లోను కారనితెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి అఖిల్, హెల్త్ సూపర్వైజర్లు,   స్టాఫ్ నర్స్ శాంత, ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love