పరీక్షల బాధ్యతలు అంగన్వాడీకి…

– పాఠశాలకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడు
– విద్యార్థులకు దగ్గరుండి పరీక్ష రాయించిన పే సెంటర్‌ హెచ్‌ఎం
నవతెలంగాణ-ములకలపల్లి
బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ ఉపాధ్యాయుడు పరీక్షల సమయంలో పాఠశాలను అంగన్వాడీ టీచర్‌కు అప్పగించగా ఆమె నిరాకరించినా విధులకు డుమ్మా కొట్టిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట పంచాయతీ ఆనందపురం ఐటీడీఏ పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబం ధించి వివరాలిలా ఉన్నాయి. విద్యార్థులకు 5వ తరగతి పరీక్షలు జరుగు తుండటంతో ఆనందపురం ఐటీడీఏ పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా అక్కడే ఉన్న అంగన్వాడీ టీచర్‌ను విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలని కోరడంతో ఆమె నిరాకరించింది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటన విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి చూడగా పాఠశాలలో ఉపాధ్యా యుడు కనిపించలేదు. కారణం తెలు సుకునేందుకు ఆ ఉపాధ్యాయునికి ఉన్న తాధికారులు ఫోన్‌ చేసినా స్పందించలేదు. అయితే అక్కడ తనిఖీకి వచ్చిన ఉన్నతాధికారి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఉపాధ్యాయుడు ఎప్పుడూ సరైన సమయానికి పాఠశాలకు రారని, విద్యాబోధన కంటే ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతారని వచ్చిన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పే సెంటర్‌ ప్రధానోపాధ్యాయులు కె.వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఆనందపురం పాఠశాల ఉపాధ్యాయుడు గురువారం పాఠశాలకు రాలేదని విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా ఫిర్యాదు వచ్చిందని, పరీక్షల సమ యంలో ఇలా చేయడంతో తానే స్వయంగా పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయగా ఉపాధ్యాయుడు లేనట్లు గుర్తించి దగ్గరుండి విద్యార్థులకు పరీక్ష లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో, విద్యాశాఖ ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.

Spread the love