ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించిన అంగన్వాడీలు

– సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్‌ ముట్టడిస్తాం
– సీఐటీయూ అంగన్వాడీ జిల్లా కార్యదర్శి జి.పద్మ
నవతెలంగాణ-పాల్వంచ
అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని, అధికారులు సమ్మె విచ్చున్నకర చర్యలు మానుకోవాలని పది రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ నిరువధిక సమ్మెలో భాగంగా బుధవారం సీఐటీయూ, ఏఐటియుసి ఆధ్వర్యంలో పాల్వంచలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించి, బైఠాయించారు. ధర్నా నిర్వహించారు. ఇంట్లోనే ఉన్న ఎమ్మెల్యే వనమా స్పందించి ఆందోళన చేస్తున్న అంగన్వాడీల దగ్గరికి వచ్చారు. దీంతో నాయకులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వనమాకి అందజేశారు. ఈ సందర్భంగా స్పందిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్‌ పీఏతో, బీడబ్ల్యుతో ఫోన్లో మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని పై అధికారులతో మాట్లాడారు. అంగన్వాడీలు పెట్టిన డిమాండ్స్‌ను ఎన్నో కొన్ని పరిష్కారం చేయాలని కోరారు. అంగన్వాడీల సమస్యలు న్యాయమైనవేనని అతి తక్కువ జీతంతో ఎలా బతుకుతారంటూ మీ సమస్యల పరిష్కారానికి విచ్చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు అంగన్వాడీ జిల్లా కార్యదర్శి జి.పద్మ మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె విచ్చున్నకర చర్యలు మానుకోవాలన్నారు. ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యేలు మా సమస్యను తీసుకపోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డి.వీరన్న, అంగన్వాడి జిల్లా కోశాధికారి పి.వెంకటరమణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోనెమని, సీఐటీయూ అంగన్వాడి జిల్లా నాయకులు కళావతి, జ్యోతి, రాజ్యలక్ష్మి, రమ్య, చుక్కమ్మ, సిపిఐ మండల కార్యదర్శి పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
సమ్మె పరిష్కారం కై ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయాలి
భద్రాచలం రూరల్‌ : గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మినీ టీచర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి అమలు చేసే విధంగా జిల్లాలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రిని, ఐసీడీఎస్‌ మంత్రిని ఎమ్మెల్యేలు నిలదీయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఎమ్మెల్యేల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు భద్రాచలం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా ఏజే రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రెండు లక్షల 50 వేలు జీతం తీసుకుంటున్నారని, మంత్రులు నాలుగున్నర లక్షలు జీతం తీసుకుంటున్నారని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు రూ.7వేల నుండి రూ.13వేలు మాత్రమే జీతాలు ఇస్తున్నారని, ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సంఘాలతోటి చర్చలు జరిపి తమ్మెను పరిష్కారం చేయాలని, లేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, ధరల పెరుగుదల కనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమైన చర్య : ఎమ్మెల్యే పొదెం వీరయ్య
కలెక్టర్‌, ఐసీడీఎస్‌ అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం దుర్మార్గమైన చర్యగా భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య పేర్కొన్నారు. అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సంఘాలతోటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. తన కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మినీ టీచర్ల వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పోదెం మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.బి.నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాయం రాధాకుమారి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.విజయశీల, వీరభద్రమ్మ, ఏఐటీయూసీ డివిజన్‌ నాయకులు నోముల రామిరెడ్డి, ఏఐటీయూసీ అంగన్వాడి టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ నాయకులు నరసమ్మ, చిన్నారి, పొలమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : గత పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాల యం ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటీయు, ఏఐటియూసి నేతలు నబీ, దేవరకొండ శంకర్‌ మాట్లాడుతూ వారిపై ప్రభు త్వం, కలెక్టరు, ఐసిడీఎస్‌ అధికారులు ఉక్కు పాదం మోపుతు న్నారు. ఇల్లందు, టేకులపల్లి, గుండాల, కామేపల్లి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఈసం వెంకటమ్మ, మరియ, ఫాతిమా, మమత, నాగలక్ష్మి, వసంత, బత్తుల దేవేంద్ర, శకుంతల, సారమ్మ, ధనమ్మ, పూలమ్మా, భారతి తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని బుధవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద అంగన్వాడీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అంగన్వాడీ డిమాండలు న్యాయమైనవి అని, సమ్మెలో వున్న అంగన్వాడీ సెంటర్‌ తాళాలు బద్దలు కొట్టవద్దని దమ్మపేట, అశ్వారావుపేట ఐసీడీఎస్‌ సీడీపీవోలకు చరవాణి ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రాధ, పద్మ, సూరమ్మ, శాంతి, కృష్ణవేణి, రాజ్యలక్ష్మి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love