ఐసిడిఎస్ ఆఫీస్ ను ముట్టడించిన అంగన్వాడీలు.

– అంగన్ వాడిలకు అండగా సీపీఐ(ఎం)
– ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు డిమాండ్
నవతెలంగాణ -నసురుల్లాబాద్ 
తమ న్యాయమైన  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెలో ఒక భాగంగా గురువారం బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంను ముట్టడించారు. నేడు ఉదయం అంగన్వాడీ ఉద్యోగులు  అంబేద్కర్ చౌరస్తా నుండి  ఐసిడిఎస్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను  పరిష్కరించేంత వరకు నిరవధిక కొనసాగుతుందన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట  సీఐటీయూ జిల్లా నాయకుడు కలిల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. టీచర్లు మాట్లాడుతూ..  తమకు జీతాలు రావడంలేదని అంగన్ వాడి వర్కర్లు, హెల్పర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా  సీఐటీయూ నాయకుడు కలిల్ అంగన్వాడీ టీచర్లకు రూ.10 లక్షలు, మినీ టీచర్లకు రూ. 5 లక్షల బెనిఫిట్స్ అందజేయాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి నెలకు రూ. 26 వేలు కనీస వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు. కనీస వేతనాలు 26 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యాలు 10 లక్షలు టీచర్ కు ఆయాకు ఐదు లక్షలు అదే విధంగా టీచర్ రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల అంగన్ వాడి టీచర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love