- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
గత నెల 31 వరకు సెలవులు ప్రకటించిన అంగన్ వాడి కేంద్రాలు తిరిగి సోమవారం పున:ప్రారంభం అయ్యాయి. మండలంలోని పెద్దతూండ్ల, తాడిచెర్ల గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాల్లోనే టీచర్లు, ఆయాలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం అమ్మమాట, అంగన్ వాడి బాట కార్యక్రమాలను చేపట్టారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 5 ఏళ్ళు లోపు చిన్నారులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో, మూడేళ్ళ లోపు చిన్నారులను అంగన్ వాడి కేంద్రాల్లో చేర్పించాలని కోరారు.
- Advertisement -



