21న ఆంజనేయ స్వామి ఆలయ పూజా సామాగ్రి వేలంపాట

నవతెలంగాణ –  మద్నూర్
దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో కొనసాగుతున్న ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణంలో పూజా సామాగ్రి అమ్మడానికి ఈనెల 21న ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. వేలంపాటలో పాల్గొనే భక్తులు ముందుగా పదివేల రూపాయల డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. డిపాజిట్ చేసిన భక్తులు మాత్రమే వేలంపాటలో పాల్గొని అర్హత ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. పూజా సామాగ్రి వేలంపాట రెండు సంవత్సరాల కాల పరిమితి ప్రకారం నిర్వహించబడుతుందని తెలిపారు. వేలం పాటలో నెగ్గిన వారు వెంటనే 50% చెల్లించవలసి ఉంటుందని మిగిలిన డబ్బులు 90 రోజుల్లో చెల్లించవలసి ఉంటుందని భక్తులకు ఆ ప్రకటనలో తెలియజేశారు. గత ఏడాది పూజా సామాగ్రి అమ్మటానికి నాలుగు లక్షల 51 వేల రూపాయలు ఆలయానికి ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.

Spread the love