కట్ట మైసమ్మ ఆలయంలో అన్నదానం

– ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు
– ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం
– మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌ నాయక్‌
నవతెలంగాణ-తాండూరు
అత్యంత మైమాన్వితురాలు కట్టమైసమ్మ తల్లి అని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌ నాయక్‌ అన్నారు. శనివారం తాండూరు పట్టణం ఆదర్శనగర్‌లో కొలువువై న శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్క రించుకొని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విఠల్‌ నాయక్‌ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల ను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విటల్‌ నాయక్‌ మాట్లాడుతూ..10 నెలలు గా ప్రతి అమావాస్యనూ పురస్కరించుకొని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పా టు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్‌ కుమ్మరి నర్సింలు లను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలి పారు. కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లు తున్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతినెల అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి అన్న దానం చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్ర మంలో అలయ కమిటీ ముఖ్య సలహాదారులు పాప య్య, ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌, అంజయ్య, మెకానిక్‌ సు ధాకర్‌, ఆలయ పూజారి, భక్తులు తదితరులున్నారు.

Spread the love