సంతోషిమాత ఆలయంలో వార్షికోత్సవ ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల సంతోషిమాత ఆలయంలో శుక్రవారం నాడు వార్షికోత్సవ ప్రత్యేక పూజలు ఆలయ పూజారి  శెట్టివార్ సంతోషి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గణపతి పూజ నవగ్రహాల పూజలు తీర్థ ప్రసాదం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ పూజలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై పూజల్లో పాల్గొన్నారు. సంతోషిమాత ఆలయానికి నమ్ముకొని మద్నూర్ మండల కేంద్రంలో ఆర్.ఎం.పి పిఎంపి ప్రైవేటు క్లినికల్గా కొన్ని సంవత్సరాల పాటు మద్నూర్లో కొనసాగిస్తూ కొన్ని రోజుల క్రితం ఈ గ్రామం నుండి ఎక్కడికో వెళ్లిన పొతంగల్ కర్ సురేష్ డాక్టర్ వార్షికోత్సవ పూజలకు ప్రత్యేకంగా వచ్చి పాల్గొన్నారు. గ్రామ మహిళలతో పాటు ఇతర మండలాల నుండి వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Spread the love